లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన సైబరాబాద్‌ సీపీ

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ కుటుంబ సమేతంగా అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయాన్ని సందర్శించి, స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో ఆలయానికి వచ్చిన సైబరాబాద్‌ సీపీకి ఆయల అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దైవ దర్శనం అనంతరం సజ్జనార్‌ ఆలయ ప్రాంగణంలో కలియ తిరుగుతూ.. ఆలయ శిల్ప కళా సంపదను చూసి మురిసిపోయారు. అర్చకులను అడిగి వాటి విశిష్టను తెలుసుకున్నారు. ఆలయంలోని శిల్పాలు అద్భుతంగా ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. సీపీ కుటుంబ సమేతంగా ఆలయంలో చాలాసేపు గడిపారు. ఇటీవల హైదరాబాద్‌ పరిసర ప్రాతంలో దిశ అనే అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడిన నలుగురు నిందితులను అనివార్య కారణాల వల్ల సైబరాబాద్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్‌ జరిగిన నాటి నుంచి సీపీ సజ్జనార్‌ పేరు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ మారుమోగుతోంది. కరుడుగట్టిన నిందితులకు సరైన శిక్ష విధించారని పోలీసులను ప్రజలు ప్రశంసించారు.