‘ప్రైడ్‌ ఆఫ్‌ హైదరాబాద్ అవార్డు’కు ఎంపికైన సింగరేణి ఛైర్మన్‌..

 సింగరేణి ఛైర్మన్‌& ఎం.డి. ఎన్‌.శ్రీధర్‌ 'ప్రైడ్‌ ఆఫ్‌ హైదరాబాద్ అవార్డు'కు ఎన్నికయ్యారు. సింగరేణి సంస్థను అత్యద్భుత వృద్ధి రేటుతో నడుపుతూ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన ఆయనకు ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా వారు 'ప్రైడ్‌ ఆఫ్‌ హైదరాబాద్ అవార్డు'కు ఆయనను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన 41వ ఆల్‌ ఇండియా పబ్లిక్‌ రిలేషన్స్‌ సోసైటీ ఆఫ్‌ ఇండియా కాన్ఫరెన్సు-2019కు ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖా మంత్రి మహమూద్‌ అలీ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా సింగరేణి చైర్మన్ ను సన్మానించి, అవార్డు అందించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో ఎన్‌.శ్రీధర్‌ సింగరేణిని అత్యద్భుత రీతిలో అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. తెలంగాణ పరిశ్రమ ప్రతిభకు జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చారని ప్రశంసించారు.